Road Accident: వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయనగరం

Road Accident: వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు

Updated on: Jan 07, 2021 | 1:41 AM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయనగరం జిల్లా కోరాడపేట సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి మామిడి సతీష్‌, రవికుమార్‌, విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో జరిగే వివాహానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అలాగే విజయనగరం మండలం కోరుకొండ ప్రాంతానికి చెందిన ప్రజ్వల్‌, రవికుమార్‌, రాజులు బైక్‌పై కోరాడపేట వైపు వస్తుండగా, రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మామిడి సతీష్‌ (23), ప్రజ్వల్‌ (20)లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో రవికుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: Woman Murder: చిత్తూరు జిల్లాలో దారుణం.. మహిళా రైతు దారుణ హత్య.. ముగ్గురికి తీవ్ర గాయాలు