Road Accident : మితిమీరిన వేగం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లింగారెడ్డి గూడాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం పైన వెళుతున్న వ్యక్తి ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహననం పై వెళుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్- బెంగుళూరు పాత జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఇంద్రానగర్ కాలానికి చెందిన నర్సింలుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణం స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :