Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాలీ ఆటోను ఢీకొన్న బొలెరో.. నలుగురు మృతి

|

Feb 08, 2022 | 4:40 PM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపించడం, ఓవర్‌టెక్‌ చేయడం, మద్యం తాగి నడిపించడం వంటి కారణాల..

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాలీ ఆటోను ఢీకొన్న బొలెరో.. నలుగురు మృతి
Follow us on

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపించడం, ఓవర్‌టెక్‌ చేయడం, మద్యం తాగి నడిపించడం వంటి కారణాల వల్ల అమాయకులు బలవుతున్నారు. ఇక తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాలీ ఆటోను ఓ బొలెరో వాహనం ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బేస్తవారిపేట మండలం మోక్షగుండం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి:

2008 Ahmedabad bomb blast: ఎట్టకేలకు అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో తుది తీర్పు.. దోషులుగా 49 మంది..

AP Crime news: లిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. పొలాల్లోకి తీసుకెళ్లి.. ఆపై..??