దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!

కడప జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. ఎర్రగుంట్ల ఊరి శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు. చెరువు ఘాట్ సమీపంలోని లోయలో టిఫిన్ బాక్సులో తల, మరో చోట మొండెం పడి ఉంది. సినిమా థ్రిల్లర్‌ని తలపించేలా హత్య జరగడంతో...

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!

Updated on: Jun 25, 2020 | 12:42 PM

కడప జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. ఎర్రగుంట్ల ఊరి శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు. చెరువు ఘాట్ సమీపంలోని లోయలో టిఫిన్ బాక్సులో తల, మరో చోట మొండెం పడి ఉంది. సినిమా థ్రిల్లర్‌ని తలపించేలా హత్య జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన విశ్రాంత ఉద్యోగి వెంకటరమణయ్య అప్పులు ఇస్తూంటాడు. ఈ క్రమంలోనే మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్యకు రూ.50 లక్షల అప్పు ఇచ్చాడు. అయితే అప్పుకి ఇచ్చిన గడువు ముగియడంతో.. వెంకటరమణ ముసలయ్యకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. అలాగే ఈ విషయమై వీరిద్దరి మధ్య ఒక రోజు గొడవ జరిగింది. అనంతరం ఈ నెల 22 నుంచి వెంకటరమణ కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంటిలో తనిఖీ నిర్వహించగా.. వెంకటరమణ మృతదేహం లభ్యమయ్యింది. తల ఏదని పోలీసులు ప్రశ్నించగా.. టిఫిన్ బాక్స్‌లో పెట్టి లోయలో పడేసినట్టు ముసలయ్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ప్రస్తుతం ములసయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More: 

పెట్రోల్ ధరల మోత.. వాహనదారులకు ఝలక్..

వచ్చే నెల నుంచి మొదలు కానున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్!

Loading...
Unable to load recommendations.
Follow Us