Rape and Suicide: యువతి ఆత్మహత్య.. రేపిస్టుని పట్టించిన వీర్యకణాలు

 19 ఏళ్ల‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌న్న కేసులో విచార‌ణ జ‌రుపుతున్న గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర పోలీసుల‌కు దిమ్మ‌తిరిగే విష‌యాలు వెలుగుచూశాయి.

Rape and Suicide: యువతి ఆత్మహత్య.. రేపిస్టుని పట్టించిన వీర్యకణాలు

Updated on: Jun 13, 2021 | 11:56 AM

19 ఏళ్ల‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌న్న కేసులో విచార‌ణ జ‌రుపుతున్న గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర పోలీసుల‌కు దిమ్మ‌తిరిగే విష‌యాలు వెలుగుచూశాయి. మహిళ గర్భాశయం ప్రాంతంలో స్పెర్మ్ కణాలు ఉన్నట్లు శవపరీక్ష నివేదికలో తేలింది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. నిందితులు, ఫుడ్ డెలివరీ కంపెనీలో వారి సహోద్యోగి అయిన బాధితురాలిని జూన్ 8 న ఒక ప్రైవేట్ పార్టీలో మద్యం సేవించమని బలవంతం చేశార‌ని, ఆపై వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశార‌ని పోలీసులు తెలిపారు. జూన్ 10 ఉదయం తన ఇంట్లో యువ‌తి  ఉరి వేసుకుని మరణించింది. ఈ మేర‌కు బాధితురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

“ఆత్య‌హ‌త్య కేసు నమోదు చేయడానికి కుటుంబ స‌భ్యులు మమ్మల్ని సంప్రదించినప్పుడు,  తండ్రితో విభేదాల కారణంగా ఆమె వేరుగా నివసిస్తున్న‌ట్లు తెలిసింది. దీంతో మాకు అనుమానం క‌లిగింది. ఆమెకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలియదని కుటుంబం తెలిపింది. శవపరీక్ష సమయంలో నిర్దిష్ట ఫోరెన్సిక్ పరీక్ష చేయాల‌ని నిపుణుల‌ను అడిగాము. పోస్టుమార్టం చేసిన టీమ్ ఆమె గర్భాశయ ప్ర‌దేశంలో స్పెర్మ్ కణాల ఉనికిని గుర్తించింది. ఆ తరువాత, మేము లైంగిక వేధింపుల కోణం నుండి కేసును విచారించాము. ఆ తర్వాత నిందితుల గురించి తెలిసింది” అని కేసును విచారిస్తున్న‌ ఇన్స్పెక్టర్ తెలిపారు.

Also Read: ఈ పొగతో కరోనా పరార‌వుతుంద‌ట‌.. అమలాపురంలో వైర‌స్ కట్టడికి వినూత్న ప్రయత్నం

ఆన్‌లైన్‌లో వ్యక్తిగత బ్యాంకు రుణం పొందడం ఎలా..? ఎవరెవరు అర్హులు.. పూర్తి వివరాలు

Loading...
Unable to load recommendations.
Follow Us