ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 పెళ్లిళ్లు చేసుకుని.. 31వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఊహించని ట్విస్ట్

|

May 13, 2022 | 11:59 AM

పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేయడం ఇటీవలి కాలంలో అధికమయ్యాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh), రాజస్థాన్‌(Rajasthan) రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలా పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న....

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 పెళ్లిళ్లు చేసుకుని.. 31వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఊహించని ట్విస్ట్
Marriage
Follow us on

పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేయడం ఇటీవలి కాలంలో అధికమయ్యాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh), రాజస్థాన్‌(Rajasthan) రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలా పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకొని, 31వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళతో పాటు మరికొందరిని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్‌ దుంగార్‌పూర్ జిల్లా సగ్వారా పోలీసులు ఇప్పటివరకు 30 మందిని వివాహం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మహిళను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లోని జబల్‌పూర్‌(Jabalpur)లో దొంగ పెళ్లికూతురును అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఎంచుకొని, వారే లక్ష్యంగా మోసాలు చేస్తోందని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ చంద్ర భట్‌కు గతేడాది వివాహం జరిగింది. పెళ్లిళ్ల ఏజెంట్ పరేష్ జైన్.. రీనా ఠాకూర్ అనే యువతితో పెళ్లి జరిపించాడు. పెళ్లిని సెట్ చేసినందుకు పరేష్ అతడి నుంచి 5 లక్షలు తీసుకున్నాడు.

పెళ్లయిన వారం రోజుల పాటు అత్తింట్లో ఉన్న రీనా ఆ తర్వాత ప్రకాశ్ చంద్రతో కలిసి జబల్‌పూర్‌కు వెళ్లింది. అక్కడి నుంచి మళ్లీ తిరిగి వస్తుండగా ప్రకాశ్ చంద్రపై దాడి చేయించింది. అనంతరం తన గ్యాంగ్‌తో కలిసి పారిపోయింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కంప్లైంట్ తో కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో కీలక విషయాలు తెలిశాయి. జబల్‌పూర్‌కు చెందిన పూజా బర్మన్ అనే వ్యక్తి ఈ నకిలీ పెళ్లిళ్ల ముఠాను నడుపుతున్నట్లు గుర్తించారు. సీతా చౌదరి కూడా అతడితో కలిసి పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. నకిలీ పేర్లు, కొంతమంది అమ్మాయిల చిరునామాలు, ఆధార్ కార్డులు, ఇతర ధృవపత్రాలు తయారు చేసి, ఏజెంట్ల సహాయంతో నకిలీ పెళ్లిళ్లు చేయిస్తున్నాడని గుర్తించారు. అనంతరం వారి నుంచి డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకొని పారిపోతున్నారని పోలీసులు తెలిపారు.

ఇలా ఇప్పటి వరకు వీరి చేతిలో చాలా మంది మోసపోయారని వెల్లడించారు. రీనా ఠాకూర్‌ను అరెస్ట్ చేసి.. ఆమెతో పాటు ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు..రూ.50000ల జీతం..

Telangana: రుణాల ఆశతో ఏపీలో మీటర్లు పెడుతున్నారు.. కానీ కేసీఆర్ కు రైతులే ముఖ్యం.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్