పంజాబ్‌లోని జలంధర్‌లో ఘోరం జరిగింది. సోమవారం ఉదయం రోడ్డు దాటడానికి ఎదురుచూస్తున్న ఇద్దరు యువతులను కారు చాలా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జలంధర్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్డుపై ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కార్ షోరూమ్‌లో పనిచేసే నవజోత్ కౌర్, ఆమె స్నేహితరాలితో కలిసి రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. అదే సమంయలో హోషియార్‌పూర్ నంబర్ గల మారుతీ బ్రెజ్జ కారును పంజాబ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ అమృత్ పాల్ సింగ్ నడుపుతున్నారు. యువతులు రోడ్డు దాటే క్రమంలో ఆ కారు వారిని ఢీకొట్టింది. అమృత్ పాల్ హరికే పట్టణంలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అతడి అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. జలంధర్-ఫగ్వారా హైవేలోని ధనేవలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం తర్వాత స్థానికులు జలంధర్ కాంట్ వద్ద వానాలను నిలిపివేయడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి వ్యతిరేకంగా ఒక సమూహం హైవేపై ధర్నాలో కూర్చుంది.
“నా కూతురు ఉదయం పని కోసం బయలుదేరింది. రైల్వే క్రాసింగ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా కారు వారిని ఢీకొట్టింది. సబ్-ఇన్స్‌పెక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలి” అని నవజోత్ తల్లి తేజిందర్ కౌర్ అన్నారు. అమృత్ పాల్ సింగ్‌పై హత్య కేసు నమోదు చేయకపోతే తాము హైవేని క్లియర్ చేయలేమని స్థానికులు తెలిపారు. ఈ నిరసనతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
पंजाब में एक पुलिस इन्स्पेक्टर की गाड़ी ने दो लड़कियों को देखें किस तरह कुचला। एक की मौत। video via @singhaman1904 pic.twitter.com/QZlQ3S9Bz8
— Narendra nath mishra (@iamnarendranath) October 18, 2021
Read Also… Lawyer Killed: యూపీలో దారుణం.. కోర్టులో న్యాయవాది హత్య.. తుపాకీతో కాల్పులు జరిపి..