Mystery: హత్య చేశారు.. చేయలేదని బుకాయించారు.. కానీ, పోలీసుల శాటిలైట్ వీడియోకి దొరికిపోయారు!

|

Apr 12, 2021 | 9:28 PM

శాటిలైట్ వీడియో ఏమిటి? మతేమన్నా పోయిందా అనుకుంటున్నారా? మేమిచ్చిన హెడింగ్ కరెక్ట్.. కావాలంటే ఇది చదవండి..

Mystery: హత్య చేశారు.. చేయలేదని బుకాయించారు.. కానీ, పోలీసుల శాటిలైట్ వీడియోకి దొరికిపోయారు!
Mystery
Follow us on

Mystery:నేరం చేయడం నేరగాళ్ల పని.. నేరాన్ని కప్పిపుచ్చడానికి చావు తెలివితేటలూ ఉపయోగిస్తారు. కొందరు కరుడుగట్టిన నేరగాళ్లయితే.. అసలు తాము చేసిన నేరాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటపెట్టారు. నేరస్థులను పట్టుకోవడం.. దర్యాప్తు చేయడం.. అసలు నేరస్థుల నుంచి నేరం గురించిన సమాచారాన్ని రాబట్టడం పోలీసుల విధి. ఎంత మొండి నేరగాళ్లయినా సరే.. తమదైన పద్ధతిలో ట్రీట్ చేసి నేరాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు పోలీసులు. ఒక్కోసారి అమాయకుల్ని కూడా తమ స్టైల్ లో ఇరికించేస్తారనుకోండి అది వేరే సంగతి. కానీ, పోలీసులు చిత్రహింసలు పెట్టి మాత్రమే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న ట్రిక్ లు ఉపయోగించి కూడా నేరస్థులను దారిలోకి తెచ్చేస్తారు. అదిగో అలాంటి తెలివైన పనే చేశారు ఢిల్లీ పోలీసులు. పోలీసులు ఇచ్చిన షాక్ కి ఆ హంతకులకు మతిపోయింది. అసలు ఏం జరిగిందంటే..

దేశరాజధానిలో ఈ నెల 5వ తేదీన దారుణ హత్య జరిగింది. మంగోల్‌పురి ప్రాంతంలో చంద్రభాన్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరిన పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తించి హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

చనిపోయిన చంద్రభాను ఎవరితో తిరిగాడు.. చనిపోయే ముందు ఎక్కడ కనిపించాడు. ఆ సమయంలో ఎవరు ఆయనతో ఉన్నారు వంటి విషయాలు పోలీసులు కూపీ లాగారు. మృతుడు చనిపోవడానికి కొద్దిసేపటి ముందు రాజు, ప్రదీప్ అనే వ్యక్తులతో చివరిసారిగా కనిపించినట్టు కనిపెట్టారు. వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తమ స్టైల్ లో వారిని ప్రశ్నించారు. అయినా ఫలితం లేకపోయింది. వారిచ్చిన సమాధానాలు అసలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.

సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు మృతుడు ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళుతున్నట్టు వీడియో దొరికింది. కానీ, అందులో ఉన్న ఇద్దరిని గుర్తించడం కష్టంగా మారింది. అయితే, కచ్చితంగా హత్య చేసింది వీరిద్దరే అనే అంచనాకు వచ్చారు పోలీసులు దీంతో మరోమారు వారిని ప్రశ్నించారు. కానీ, ఆ కేటుగాళ్లు మాత్రం ఎటువంటి నిజం చెప్పకపోగా..పోలీసులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు విషయం అర్ధం అయిపోయింది.
హత్య చేసింది మీరే అని తేలిపోయింది అని వారికి చెప్పారు. సీసీలో మీరు కనిపించలేదు కానీ, మీరు మాత్రం అడ్డంగా దొరికారు అంటూ దబాయించారు. మీరు ఏం చేశారన్నది లేటెస్ట్ టెక్నాలజీతో శాటిలైట్ కెమెరాతో మేం కనిపెట్టాం అని ఝలక్ ఇచ్చారు. దీంతో హంతకులు ఇద్దరూ శాటిలైట్ కెమెరాలో నిజంగానే రికార్డు అయివుంటుంది అనుకుని భయపడి.. నిజం చెప్పేశారు.

చంద్రభాను తమను ఘోరంగా అవమానించాడనీ, మద్యం తాగమంటూ కొట్టి హింసించాడనీ అందుకే చంపేశామని చెప్పారు. ఇదండీ సంగతి. పోలీసుల స్మార్ట్ నెస్ ఒక కేసును ఈవిధంగా పరిష్కరించింది.

Also Read: ఎంబీబీస్ అమ్మాయి నైన్త్ క్లాస్ అబ్బాయి…!! చివరికి ట్విస్ట్ ఏంటంటే…?? ( వీడియో )

Gun Misfire : తుపాకి మిస్‌ ఫైర్‌.. హోంగార్డ్ భార్య మృతి.. ఘటనకు సంబంధించి కారణాలు ఇలా..?