తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో కలకలం రేపిన తల వెంట్రుకల దొంగతనం కేసును సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు చేధించారు. అస్సాం రాష్ట్రం హౌరా ఘాట్ మండలానికి చెందిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని రిమాండుకు తరలించారు.
జనవరి 20వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగింది. అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయంలోకి చొరబడ్డ దుండగులు కేశఖండన శాల స్టోర్ రూమ్ నుంచి 5 కేజీల తలనీలాల దొంగలించారు. స్పాట్ కు చేరుకుని అన్ని వివరాలు తెలుసుకున్న పోలీసులు.. రెండు టీమ్స్ గా ఏర్పడి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఇద్దరు దుండగులు ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే నిందితులు అస్సాంకు చెందినవారిగా గుర్తించిన పోలీసులు.. వారిలో ఒకరు అదే దేవాలయంలో కొన్నాళ్లు పనిచేసినట్లు నిర్ధారించారు. దీంతో ఇక్కడ్నుంచి అస్సాం వెళ్లిన కాప్స్ టీమ్ వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితులను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
China boys: అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచే దిశగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదాస్పద నోటీసు జారీ
Covid-19 Vaccines by Drone: డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. రిమోట్ ప్రాంతాలపై ఫోకస్..