వివాహేతర సంబంధం ఆమె పాలిట శాపమైంది.. చంపేసి రెండు రోజులు మృతదేహంతోనే ఉన్నాడు.. ఘటనకు సంబంధించి కారణాలు..

Latest Crime: వివాహేతర సంబంధం ఆమె పాలిట శాపమైంది. భర్తను, పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. చివరికి అతడి చేతిలోనే

వివాహేతర సంబంధం ఆమె పాలిట శాపమైంది.. చంపేసి రెండు రోజులు మృతదేహంతోనే ఉన్నాడు.. ఘటనకు సంబంధించి కారణాలు..

Updated on: Jan 12, 2021 | 8:19 AM

Latest Crime: వివాహేతర సంబంధం ఆమె పాలిట శాపమైంది. భర్తను, పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. చివరికి అతడి చేతిలోనే హత్యకు గురైంది. ఇటీవల హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఠాణా పరిధి ఎస్‌ఎస్‌ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చింతోనిచిలక గ్రామానికి చెందిన కుంపటి వెంకటనారాయణ అలియాస్‌ వెంకటేశ్వర్లు ఏడోతరగతి వరకు చదువుకున్నాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యను వదిలేశాడు. ఆయుర్వేద వైద్యం నేర్చుకుని ఊళ్లు తిరుగుతూ ఔషధాలు విక్రయించేవాడు.

ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన స్రవంతితో పరిచయమైంది. వెంకటనారాయణ మాటలకు ఆకర్షితురాలైన స్రవంతి కుటుంబాన్ని వదిలేసి అతడితో వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి హైదరాబాద్ వచ్చి అమీర్‌పేటలో ఔషధాలు విక్రయిస్తూ బతుకుతున్నారు. అనంతరం ఎస్‌ఎస్‌ కాలనీలో మరో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈనెల 3న వెంకటనారాయణ మద్యం మత్తులో ఇంటికి రావడంతో రోజూ తాగొస్తున్నావని స్రవంతి అడిగినందుకు వెంకటనారాయణ రోకలిబండతో బాదడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ రాత్రంతా అతను శవంతో ఇంట్లోనే ఉన్నాడు. మరుసటి రోజు ఇంటి అద్దె చెల్లించి ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత రోజు మృతదేహాన్ని భవనం ప్రహరీ పక్కన పడేసి దుప్పటి కప్పి గతంలో ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఇంట్లో మూడో అంతస్తులోకి చేరాడు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వెంకటనారాయణను అదుపులోకి తీసుకొని అరస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. నడిరోడ్డుపై భార్యను దారుణంగా నరికి చంపిన భర్త

Loading...
Unable to load recommendations.
Follow Us