గుంటూరులో అర్ధరాత్రి దారుణం.. డబ్బు కోసం వ్యాపారి హత్య..!

గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. పెదకూరపాడు మండలం కాశిపాడులో మంగళవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు భార్య భర్తలపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

గుంటూరులో అర్ధరాత్రి దారుణం.. డబ్బు కోసం వ్యాపారి హత్య..!

Edited By:

Updated on: May 12, 2020 | 5:03 PM

గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. పెదకూరపాడు మండలం కాశిపాడులో మంగళవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు భార్య భర్తలపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అందులో ఇంటి యజమాని అక్కడికక్కడే మరణించగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటలు గడవకముందే దాన్ని ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి అనే యువకుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. బంగారం, డబ్బు కోసమే గోపి, వ్యాపారి రాధాకృష్టను హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద లభించిన 250 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్లెల గోపిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు.

Read This Story Also: రెహమాన్‌ పాటకు కెవిన్‌ పీటర్సన్ టిక్‌టాక్‌.. వీడియో షేర్ చేసిన సంగీత దిగ్గజం..!