Jubilee Hills Rape Case: చివరి రోజుకు చేరిన పోలీస్ కస్టడీ.. మిగతా ఐదుగురు మైనర్లతోపాటు ఏ1 విచారణ..

Hyderabad Rape Case: ముగ్గురు మైనర్లను జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించిన పోలీసులు రేప్‌కు ముందు జరిగిన అంశాలపై ప్రశ్నించారు. vis ఇక విచారణలో రేప్‌ ఘటనను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు నిందితులు. సాదుద్దిన్‌ తమను రెచ్చగొట్టాడని మిగతా నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే అసభ్యంగా ప్రవర్తించింది మైనర్లే అంటున్నాడు సాదుద్దిన్ మాలిక్‌. అంతకు ముందు వేరు వేరు వాహనాల్లో ఉస్మానియాకు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు.

Jubilee Hills Rape Case: చివరి రోజుకు చేరిన పోలీస్ కస్టడీ..  మిగతా ఐదుగురు మైనర్లతోపాటు ఏ1 విచారణ..
Jubilee Hills Rape Case

Updated on: Jun 12, 2022 | 12:40 PM

జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక రేప్‌ కేసులో నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఏ1 నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ కస్టడీ చివరి రోజు. మిగతా ఐదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్‌ కలిపి ఇవాళ జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారించనున్నారు. నిన్న నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో పొటెన్సీ టెస్టులు నిర్వహించారు. సాదుద్దిన్‌తో సహా ముగ్గురు మైనర్లను .. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు పలు కోణాల్లో వివరాలు రాబడుతున్నారు. ఈ రేప్‌ కేసులో బాధితురాలి మెడికల్‌ రిపోర్టు కీలకంగా మారింది. మైనర్‌ బాలిక మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలయ్యాయి. టాటూలా ఉండాలని మెడపై కొరికినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇక విచారణలో రేప్‌ ఘటనను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు నిందితులు. సాదుద్దిన్‌ తమను రెచ్చగొట్టాడని మిగతా నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే అసభ్యంగా ప్రవర్తించింది మైనర్లే అంటున్నాడు సాదుద్దిన్ మాలిక్‌.

ఇదిలావుంటే శనివారం ముగ్గురు మైనర్లను జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించిన పోలీసులు రేప్‌కు ముందు జరిగిన అంశాలపై ప్రశ్నించారు. ఇక విచారణలో రేప్‌ ఘటనను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు నిందితులు. సాదుద్దిన్‌ తమను రెచ్చగొట్టాడని మిగతా నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే అసభ్యంగా ప్రవర్తించింది మైనర్లే అంటున్నాడు సాదుద్దిన్ మాలిక్‌. అంతకు ముందు వేరు వేరు వాహనాల్లో ఉస్మానియాకు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు. పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.