Viral Video: చైనాలో అమానుషం.. మహిళ అని కూడా చూడకుండా దాడి చేసిన ప్రబుద్ధులు..

Viral Video: చైనాలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తున్న మహిళల బృందంపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది పురుషులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

Viral Video: చైనాలో అమానుషం.. మహిళ అని కూడా చూడకుండా దాడి చేసిన ప్రబుద్ధులు..
Viral
Follow us

|

Updated on: Jun 12, 2022 | 1:20 PM

Viral Video: చైనాలోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తున్న మహిళల బృందంపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది పురుషులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి అక్కడ ఉన్న మహిళ వీపుపై చేయి వేయడంతో, ఆమె అతన్ని దూరంగా నెట్టేసింది. దీంతో అసలు వివాదం రాజుకుంది. దీనిపై ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి సదరు మహిళపై దాడి చేశాడు. పదే పదే కొట్టిన తరువాత ఆమెను రెస్టారెంట్ నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి స్నేహితులు సైతం మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారు ఆమెతో పాటు డిన్నర్ చేసేందుకు వచ్చిన ఇతర మహిళలపై సైతం దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనలో ప్రమేయమున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

ఈ దాడి చైనాలో పెరుగుతున్న లైంగిక వేధింపులు, లింగ ఆధారిత హింసపై మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో వైరల్ గా మారటంతో.. సోషల్ మీడియాలో అనేకమంది దాడిని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన బాధితురాలు.. ఇలాంటి సంఘటన ఎవరికైనా ఎదురుకావచ్చని, కేవలం తనకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. మహిళలపై హింస పెరుగుతున్న సమాజంలో ఇలా జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. లింగ భేదం, మహిళల అణచివేత వంటివి ఉండటంపై ఆమె బాధపడ్డారని తెలుస్తోంది.

గత సంవత్సరం, ఒక ప్రముఖ చైనీస్ స్త్రీవాది జియావో మెయిలీ రెస్టారెంట్‌లో పొగతాగకూడదని అడిగిన తర్వాత ఆమె ముఖంపై వేడి ద్రవాన్ని విసిరి ఒక వ్యక్తి దాడి చేశాడు. చైనా తిరోగమన లింగ వివక్ష విధానాలు బాగా తెలుసు, అది మార్చి 2016లో మాత్రమే, అక్కడ గృహ హింసను చట్టం ద్వారా శిక్షార్హమైనదిగా మారింది. 2001కి ముందు చైనాలో విడాకులకు శారీరక వేధింపులు కూడా కారణంగా పరిగణించే వారు కాదని తేలుస్తోంది.