Telangana Crime: ‘అంకుల్‌ నాన్న లేవడం లేదు..’ పక్కింటి వారికి చిన్నారుల ఫోన్.. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా..

|

Feb 11, 2022 | 10:29 AM

అమ్మానాన్నలు లేని బాల్యాన్ని ఊహించుకోలేం. మన వెన్నంటి ఉండూ.. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. వారిలో ఏ ఒకరు లేకపోయినా..

Telangana Crime: ‘అంకుల్‌ నాన్న లేవడం లేదు..’ పక్కింటి వారికి చిన్నారుల ఫోన్.. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా..
Orphan
Follow us on

అమ్మానాన్నలు లేని బాల్యాన్ని ఊహించుకోలేం. మన వెన్నంటి ఉండూ.. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. వారిలో ఏ ఒకరు లేకపోయినా వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఇక తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారుల గురించి తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. వారు ఎదుర్కొనే ఇబ్బందులు, సవాళ్లు, జీవన పరిస్థితులు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. తాజాగా ఏడేళ్ల వ్యవధిలో అమ్మానాన్నల్ని కోల్పోయారు ఆ చిన్నారులు. ఏడేళ్ల క్రితం తల్లి చనిపోగా.. ప్రస్తుతం తండ్రి మరణించాడు. ఈ విషయాన్ని గుర్తించలేక ‘అంకుల్‌ నాన్న లేవడం లేదు..’ అంటూ ఇరుగుపొరుగుకు ఫోన్‌ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కంట తడి పెట్టిస్తున్న ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేటలో జరిగింది.

సిద్దిపేటలోని కేసీఆర్‌ నగర్‌కు చెందిన శ్రీనివాస్‌ పక్షవాతంతో బాధపడుతున్నాడు. అనారోగ్య సమస్యలు తోడవడంతో గురువారం ఇంట్లోనే మృతి చెందాడు. అతని భార్య లలిత ఏడేళ్ల క్రితం చనిపోయింది. వారికి కుమార్తె మణి, కుమారుడు మహేశ్‌ ఉన్నారు. తండ్రికి వచ్చే పింఛనుకు తోడు కుమారుడు చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నడిపించారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ మృతితో ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఏడేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథలుగా మారారు. స్పందించిన ఓ స్వచ్ఛంద సంస్థ.. నిత్యావసరాలు, కొంత నగదు అందించింది. మణి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా.. మహేశ్‌ కొన్నాళ్లుగా చదువుకు దూరంగా ఉంటున్నాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read

Aghora Hulchul: విశాఖలో రోడ్లమీద తిరుగుతూ అఘోరా బీభత్సం.. గంజాయి సేవించి వీరంగం

AP News: అమలాపురంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. కిలోమీటర్లమేర నిలిచిపోయిన వాహనాలు.. ఎందుకంటే..?

Burning Topic Live video: తెలంగాణ రాజకీయాల్లో మరో రగడ | నాపేరు మోదీ.. నా ఆశ పేదల సంక్షేమం..(వీడియో)