AIADMK Leader murder : తమిళనాడులో దారుణం జరిగింది. అన్నాడీఎంకే స్థానిక నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన తిరువారూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తుపేట సమీపం కోవిలూరు గ్రామానికి చెందిన రాజేష్ (38) సోమవారం ఉదయం ఇంటి నుంచి బైకులో వెళ్తుండగా టాస్మాక్ దుకాణం వద్ద మూడు బైకులు, కారులో వచ్చిన దుండగులు ఆయన్ను వెంబడించారు. గ్రామ శివారు ప్రాంతానికి రాగానే రాజేష్‌పై నిందితులు ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో బైక్ పైనుంచి కిందపడ్డ ఆయనను వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం తర్వాత హంతకులు సమీప ప్రాంతంలోని అడవిలోకి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని హంతకులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండిః కూలీ పనులకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 20మందికి పైగా గాయాలు..