Online Dating app: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ ద్వారా యువతితో వీడియో కాల్.. కట్ చేస్తే, ఘోరం !

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్ బస్తీలో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. మాయలేడి బ్లాక్ మెయిలింగ్‌కు నాయక్ అనే 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Online Dating app: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ ద్వారా యువతితో వీడియో కాల్.. కట్ చేస్తే, ఘోరం !
Online Dating App Cheating

Updated on: Aug 12, 2021 | 8:21 PM

Online Dating Cheating: హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్ బస్తీలో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. మాయలేడి బ్లాక్ మెయిలింగ్‌కు నాయక్ అనే 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతితో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం.. సదరు లేడీ కిలేడీ అవతారమెత్తింది. వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్ చేసి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడం ప్రారంభించింది.

సదరు వీడియో సోషల్ మీడియాలో పెడతానంటూ అబ్బాయిని బెదిరించింది. ఆమె వేధింపులు తట్టుకోలేని సదరు యువకుడు, విషయం బయటకు వస్తే ఎక్కడ పరువుపోతుందోనని తీవ్ర మనోవేదన చెందాడు. చావే శరణ్యమనుకొని ఇవాళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఉదంతం మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు బిటెక్ పూర్తి చేసినట్లు బంధువులు తెలిపారు. ఈ ఆన్లైన్ చాటింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని వారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Sileru Beauty: ఆహ్లాదకరంగా ఆంధ్రా కశ్మీర్‌.. ప్రకృతి అందాలకు పర్యాటకులు ఫిదా..