Farmer Murder: ప్రాణం తీసిన భూ తగాదా.. వృద్ధుడని కూడా చూడకండా…

|

Feb 08, 2022 | 1:17 PM

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గన్యా తండాలో దారుణం జరిగింది. భూ తగాదాల నేపథ్యంలో గుగులోతు రాంజా అనే వృద్ధుడిని కొట్టి చంపారు(Murder). ప్రత్యర్థి రైతు తన సోదరుడు,...

Farmer Murder: ప్రాణం తీసిన భూ తగాదా.. వృద్ధుడని కూడా చూడకండా...
Old Murder
Follow us on

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గన్యా తండాలో దారుణం జరిగింది. భూ తగాదాల నేపథ్యంలో గుగులోతు రాంజా అనే వృద్ధుడిని కొట్టి చంపారు(Murder). ప్రత్యర్థి రైతు తన సోదరుడు, మరొకరి సహకారంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. మూడేళ్లుగా భూమి విషయంలో గొడవ పడుతున్న నేలపట్లకు చెందిన చిలకబత్తిన రామారావు అనే వ్యక్తి… తన తండ్రిని కొట్టిచంపాడని మృతుడి కుమారుడు రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి రామారావు సోదరుడు సురేందర్‌, మరో వ్యక్తి సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ముగ్గురిపై హత్య కేసు(Murder case) నమోదు చేసినట్లు ఎస్‌ఐ నందీప్‌ తెలిపారు. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా, చిలకబత్తిన రామారావు, అతని సోదరుడు సురేందర్‌ మరో వ్యక్తి పొలం వద్దకు వచ్చి, తన తండ్రిపై దాడి చేశారని రమేశ్ తెలిపాడు. ఈ ఘటనలో దెబ్బలు తాళలేక ఆయన అక్కడికక్కడే మృతి చెందాడని కన్నీటి పర్యంతమయ్యాడు.

చిలకబత్తిన రామారావు అనే వ్యక్తి.. తనకు ఈ ప్రాంతంలో భూములు లేనప్పటికీ తనకు పట్టా భూమి ఉందంటూ రైతులతో ఘర్షణకు పాల్పడుతున్నాడని మృతుడి బంధువులు, తండా వాసులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా తండావాసులు అడ్డుకున్నారు. భూమి ఎవరిదో తేల్చే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లనివ్వమంటూ అడ్డుకున్నారు. తహసీల్దార్‌ శిరీష సంఘటన స్థలానికి వెళ్లి, భూమి పూర్తిగా రాంజాదేనని, ఈ భూమిపై ఎలాంటి వివాదాలు లేవని, రామారావుకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. వెంటనే సర్వేకు ఆదేశించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

Also Read

Hijab Controversy: హిజాబ్ అంటే ఏమిటి.. దీనిపై కర్నాటకలో జరుగుతున్న రచ్చ ఏంటి..?

Jagananna Chedodu: ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్

UP BJP MANIFESTO: యూపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. అమ్మాయిలకు ఉచితంగా స్కూటీ, రైతు సంక్షేమం, ఉపాధి అవకాశాలు!