డబ్బు కోసం మోడల్ మర్డర్…పర్సులో దొరికింది రూ.500

|

Aug 25, 2019 | 4:23 PM

గత నెలలో బెంగళూరు కెంపెగౌడ విమానశ్రయ సమీపంలో హత్యకు గురైన పూజా సింగ్​ కేసును పోలీసులు ఛేదించారు.   కోల్​కతాలో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగా ఆమెను బెంగాల్​ మోడల్​ పూజా సింగ్​గా గుర్తించారు. మృతురాలి ఫోన్​కాల్స్​, మెయిల్స్​ విశ్లేషించి ఆగస్టు 21న నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… వ్యక్తిగత పనుల నిమిత్తం జులై 30న బెంగళూరు కెంపెగౌడ విమానశ్రయానికి చేరుకుంది పూజా సింగ్​. అక్కడి నుంచి హోటల్​కు వెళ్లేందుకు క్యాబ్​ బుక్​ చేసుకుంది. ఓలా క్యాబ్​ డ్రైవర్  […]

డబ్బు కోసం మోడల్ మర్డర్...పర్సులో దొరికింది రూ.500
Cab driver arrested for murder of event manager in Bengaluru
Follow us on

గత నెలలో బెంగళూరు కెంపెగౌడ విమానశ్రయ సమీపంలో హత్యకు గురైన పూజా సింగ్​ కేసును పోలీసులు ఛేదించారు.   కోల్​కతాలో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగా ఆమెను బెంగాల్​ మోడల్​ పూజా సింగ్​గా గుర్తించారు. మృతురాలి ఫోన్​కాల్స్​, మెయిల్స్​ విశ్లేషించి ఆగస్టు 21న నిందితుడిని పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే… వ్యక్తిగత పనుల నిమిత్తం జులై 30న బెంగళూరు కెంపెగౌడ విమానశ్రయానికి చేరుకుంది పూజా సింగ్​. అక్కడి నుంచి హోటల్​కు వెళ్లేందుకు క్యాబ్​ బుక్​ చేసుకుంది. ఓలా క్యాబ్​ డ్రైవర్  నగేశ్​​ ఆమెను హోటల్​ గదిలో దించాడు. మరుసటిరోజు ఉదయం.. ఎయిర్​పోర్ట్​ వద్ద దింపేందుకు రావాలని ఆమె కోరడంతో అందుకు అంగీకరించాడు.  మరుసటి రోజు ఉదయం.. ఆమెను క్యాబ్​లో తీసుకెళ్లి మధ్యలో డబ్బులు, జ్యూయలరీ డిమాండ్​ చేశాడు. తిరస్కరించిన ఆమె గట్టిగా అరిచింది. అందరికి తెలిసిపోతుందన్న భయంతో వెంటనే అతడు రాడ్​తో తలపై బాదాడు. కొద్ది సేపటికి స్పృహ వచ్చి తప్పించుకోబోతుండగా.. కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అయితే.. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న నిందితుడు ఆమె పర్సులో రూ. 500 మాత్రమే ఉన్నాయని చెప్పాడు.