మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో కీలక మలుపు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు..

|

Dec 03, 2020 | 10:37 AM

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణలో అధికారులు స్పీడ్ పెంచారు. విచారణలో భాగంగా ...

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో కీలక మలుపు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు..
Follow us on

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణలో అధికారులు స్పీడ్ పెంచారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సెక్షన్ 91 కింద రవీంద్రకు నోటీసులు ఇచ్చారు. మంత్రిపై హత్యాయత్నం ఘటనపై కొల్లు రవీంద్ర ఇటీవల చేసిన కామెంట్స్‌ నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే మంత్రిపై హత్యాయత్నం కేసులో కొల్లు రవీంద్రకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు మచిలీపట్నంలో సంచలనంగా మారింది.

కాగా, పేర్ని నాని పక్కనే తిరుగుతూ పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ హత్యాయత్నం చేసిన నిందితుడు నాగేశ్వరరావును రెండు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి నేపథ్యంలో మరికాసేపట్లో నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే నిందితుడి వాంగ్మూలం ఆధారంగా విచారణ చేస్తున్నారు. అతని కాల్ డేటా కూడా పరిశీలించారు. టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులకు నాగేశ్వరరావు ఫోన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే నిందితుడు నాగేశ్వర రావు సోదరి ఉమాదేవి కూడా టీడీపీలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మరికొందరు స్థానిక నాయకులను కూడా పోలీసులు ఇవాళ విచారించబోతున్నారు. అయితే టీడీపీ నేతలతో నాగేశ్వరరావుకు సత్సంబంధాలు ఉండటంతో అతను ఎవరెవరి పేర్లు వెల్లడిస్తాడో.. ఎవరెవరు ఈ కేసులో ఇరుక్కుంటారో అని కొందరు నేతలు టెన్షన్ పడుతున్నారట.