Tamil Nadu: సంచలనంగా మారిన ఎన్ఐఏ తనిఖీలు.. ముఖ్య నేతలే టార్గెట్.. ఇంజినీరింగ్ విద్యార్థి ప్రమేయంపై ఆరా

|

Jul 31, 2022 | 6:41 AM

తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ కదలికలు సంచలనంగా మారాయి. ముఖ్య నేతలను టార్గెట్ చేసినట్టుగా ఎన్ఐఏ సమాచారం సేకరించింది. మొన్న ఈరోడ్ లో తనిఖీలు జరిపిన ఎన్ఐఏ....

Tamil Nadu: సంచలనంగా మారిన ఎన్ఐఏ తనిఖీలు.. ముఖ్య నేతలే టార్గెట్.. ఇంజినీరింగ్ విద్యార్థి ప్రమేయంపై ఆరా
Nia
Follow us on

తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ కదలికలు సంచలనంగా మారాయి. ముఖ్య నేతలను టార్గెట్ చేసినట్టుగా ఎన్ఐఏ సమాచారం సేకరించింది. మొన్న ఈరోడ్ లో తనిఖీలు జరిపిన ఎన్ఐఏ నేడు (ఆదివారం) రాణిపేట జిల్లాలో ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. తిరుపత్తూర్ (Tirupattur) జిల్లా లో ఎన్ఐఏ అధికారుల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి మీర్ అలీ ని అదుపులోకి తీసుకోని ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఉమ్మడి వేలూరు జిల్లాలోని అనకట్టు పోలీస్ స్టేషన్ లో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. విచారణలో ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరుడిగా ఉంటూ పలువురు ముఖ్య నేతలను టార్గెట్ చేసినట్టుగా విచారణ లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. రెండు లాప్ టాప్స్, సెల్ ఫోన్స్ సీజ్ చేసి మీర్ అలీ ని అరెస్ట్ చేశారు. కాగా వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరిని అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి