Gold Scam: తక్కువ ధరకు బంగారం స్కాంలో విస్తుపోయే నిజాలు.. ఒక్కొక్కటీ బయటపెడుతోన్న నిందితురాలు నాగమణి

|

Sep 20, 2021 | 2:14 PM

విజయవాడలో సంచలనం సృష్టించిన తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం చేసిన కేసులో విస్తుపోయే నిజాలు వెలువడుతున్నాయి.

Gold Scam: తక్కువ ధరకు బంగారం స్కాంలో విస్తుపోయే నిజాలు.. ఒక్కొక్కటీ బయటపెడుతోన్న నిందితురాలు నాగమణి
Follow us on

Vijayawada – Nagamani – Gold Scam: విజయవాడలో సంచలనం సృష్టించిన తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం చేసిన కేసులో విస్తుపోయే నిజాలు వెలువడుతున్నాయి. సూర్యారావు పేట పోలీసుల విచారణలో రోజుకో కొత్త విషయాలు బయట పెడుతోంది నిందితురాలు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ రైల్వే, దుర్గ గుడి ఉద్యోగుల వద్ద పది కోట్ల రూపాయలను నాగమణి, వెంకటేశ్వరావు దోచుకున్న సంగతి తెలిసిందే. బాధితుల నుండి దోచుకున్న నగదును జల్సాలకు వినియోగించింది నాగమణి.

ఈ సొమ్మును ఆన్లైన్ రమ్మీ ఆడడంతో పాటు మద్యానికి నగదు ఖర్చు చేసినట్టు విచారణలో నాగమణి వెల్లడించింది. ఇంట్లో వంట చేసుకునేందుకు కూడా నాగమణి మినరల్ వాటర్ వాడినట్టు చెప్పింది. తమది జమీందారి కుటుంబమని కలరింగ్ ఇచ్చి బాధితుల నుండి దోపిడీకి పాల్పడింది నాగమణి.

మరో నాలుగు కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టిన నాగమణి వ్యవహారంలో ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారిప్పుడు బాధితులు. భర్త ఉండగానే మృతి చెందాడని చెప్తు రైల్వే టిసి వెంకటేశ్వరవుతో విజయవాడలో స్థిరపడిన తునికి చెందిన నాగమణి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంకా నాగమణి విచారణ కొనసాగుతోంది.

Read also: TDP: డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు.. పోలీసు విధులకు ఆటంకం.. టీడీపీ నేతలపై కేసు