బాబోయ్‌ ఉల్లి దొంగలు..పట్టేసిన నిఘా కన్ను

|

Dec 11, 2019 | 5:21 PM

దొంగలు రూటు మార్చారు..బంగారం, డబ్బు దోచుకోవడం మర్చిపోయి న్యూ ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా న్యూ ట్రెండ్‌ అనుకుంటున్నారా..ఇంకేముంది. ఉల్లి చోరీలు.  ఆనియన్స్‌ రేటు చుక్కలనంటుతుండటంతో ఉల్లి వెంట పడింది దొంగల ముఠా. గప్‌చుప్‌గా వందల కేజీల ఉల్లిని దోచేస్తున్నారు. రెండ్రోజుల క్రితం తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ఘటనల తర్వాత..ఇవాళ ముంబైలో మరో ఉల్లి దొంగతనం ఘటన వెలుగులోకొచ్చింది. ఇద్దరు దొంగలు అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ డోంగ్రి మార్కెట్‌లోని దుకాణాల్లోకి చొరబడి గుట్టు చప్పుడు […]

బాబోయ్‌ ఉల్లి దొంగలు..పట్టేసిన నిఘా కన్ను
Follow us on

దొంగలు రూటు మార్చారు..బంగారం, డబ్బు దోచుకోవడం మర్చిపోయి న్యూ ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా న్యూ ట్రెండ్‌ అనుకుంటున్నారా..ఇంకేముంది. ఉల్లి చోరీలు.  ఆనియన్స్‌ రేటు చుక్కలనంటుతుండటంతో ఉల్లి వెంట పడింది దొంగల ముఠా. గప్‌చుప్‌గా వందల కేజీల ఉల్లిని దోచేస్తున్నారు. రెండ్రోజుల క్రితం తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ఘటనల తర్వాత..ఇవాళ ముంబైలో మరో ఉల్లి దొంగతనం ఘటన వెలుగులోకొచ్చింది.

ఇద్దరు దొంగలు అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ డోంగ్రి మార్కెట్‌లోని దుకాణాల్లోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా ఉల్లి బస్తాలను కొట్టేశారు. ఎవరూ చూడలేదు కదా అని అక్కడినుంచి పరారయ్యారు. కానీ వారి చేతివాటాన్ని నిఘా కన్ను పట్టేసింది. ఉల్లి బస్తాల చోరీ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టేశారు. వారు దొంగిలించిన ఆనియన్స్‌ విలువ దాదాపు 20వేల వరకు ఉంటుందని తెలిపారు పోలీసులు.