Hyderabad: ఉసురు తీసిన అదనపు కట్నం వేధింపులు.. 13 మాసాల కుమార్తెకు ఉరి వేసి.. తల్లి ఏం చేసిందంటే..?

|

Feb 18, 2022 | 4:56 PM

హైదరాబాద్ లోని నాచారం(Nacharam) లో పెను విషాదం నెలకొంది. అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

Hyderabad: ఉసురు తీసిన అదనపు కట్నం వేధింపులు.. 13 మాసాల కుమార్తెకు ఉరి వేసి.. తల్లి ఏం చేసిందంటే..?
Follow us on

Hyderabad News: హైదరాబాద్ లోని నాచారం(Nacharam) లో పెను విషాదం నెలకొంది. అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని నాచారంలోని ఓ మహిళ, తన 13 నెలల కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కూతురు ఈ దారుణానికి ఒడిగట్టిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిచెందిన మహిళను దీపికగా పోలీసులు గుర్తించారు,

2009 లో దీపికకు చంద్రశేఖర్‌తో వివాహం అయింది. ఈ దంపతులకు 2021 ఫిబ్రవరిలో కూతురు జన్మించింది. ఈ క్రమంలో రుత్విక మొదటి పుట్టినరోజు సందర్భంగా దీపిక తల్లిదండ్రులు రెండు తులాల బంగారు గొలుసును ఇస్తామని మాట ఇచ్చారు. కానీ సమయానికి ఇవ్వలేకపోయారు. దీంతో చంద్రశేఖర్ దీపికను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తాళలేక కుమార్తెకు ఉరివేసి, తానూ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

దీపికను చంద్రశేఖర్, అతని కుటుంబ సభ్యులు హత్య చేశారని దీపిక సోదరుడు ఆరోపించాడు. అదనపు కట్నం కోసం దీపికను అత్తమామలు నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నాడు. పెళ్లిలో 25 తులాల బంగారం పెట్టామని, వారి డిమాండ్లన్నీ నెరవేర్చామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీపికను తమతో మాట్లాడనిచ్చేవారు కాదని కన్నీటిపర్యంతమయ్యాడు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read

AP Cabinet: ఉగాదికి కొత్త జిల్లాలతో పాటు కొలువుదీరనున్న కొత్తమంతివర్గం.. గంపెడు ఆశలతో నేతలు..!

House with Plastic Bottles: ప్లాసిక్‌ బాటిళ్లతో సూపర్‌ ఇళ్లు..! సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న వెరైటీ హౌస్.. వీడియో

Court Judgement: విచారణ జరుగుతుండంగా కూల్‌డ్రింక్ తాగాడు.. అంతే.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు జడ్జి..