పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. దొంగతుర్తి గ్రామంలో అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు. సిలిండర్ పేలి మంటలు ఇంటికి అంటుకోవడంతో.. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకొడుకు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. సిలిండర్ ధాటికి పెంకుటిల్లు కుప్పకూలింది. మంటల్లో చిక్కుకున్న తల్లీకొడుకును కాపాడేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ …ఫైర్ ఇంజన్ వచ్చే సరికి ప్రమాదం జరిగిపోయింది. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగటంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. మృతులు తల్లికొడుకులు గొట్టే యశోద, రోహన్‌గా పోలీసులు గుర్తించారు.ఫైర్ ఇంజిన్ వచ్చే సరికి ఇళ్లంతా కాలీ పోయింది. తల్లీకొడుకులు సజీవదహనం అయ్యారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మరో దిశ ఘటన..రంగారెడ్డి జిల్లాలో దారుణం