Mother and Daughter Suicide:పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి, కుమార్తె గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో జరిగింది. గుర్తుతెలియని తల్లి, కూతురు గోదావరిలో దూకడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతుల వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.