Anil Deshmukh judicial custody: మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను మరో రెండు వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో సోమవారం విచారణ చేపట్టిన స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా అనిల్ దేశ్‌ముఖ్ తరపు న్యాయవాది ఆయనకు ఆహారం, బెడ్, మందుల కోసం అప్పీల్ చేశారు. తన క్లయింట్ వయస్సు, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఆహారం, మందులు, బెడ్ కు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు బెడ్, జైలు వైద్యుల కన్సల్టేషన్‌తో సంబంధిత మెడిసన్ సమకూర్చాలని పీఎంఎల్ఏ కోర్టు అదేశించింది. ఇంటి నుంచి వండి పంపిన ఆహారాన్ని అనుమతించాలనే విజ్ఞప్తిని కోర్టు పెండింగ్‌లో ఉంచింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం.. 12 గంటలపాటు ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నవంబర్ 1న దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈడీ రిమాండ్‌కో కోర్టు పంపగా, ఆ రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ చేసుకున్న విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు నవంబర్ 7న తోసిపుచ్చింది. అనంతరం ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. తదుపరి రోజు దిగువ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను ముంబై హైకోర్టు తోసిపుచ్చుతూ.. నవంబర్ 12 వరకూ ఈడీ రిమాండ్‌కు దేశ్‌ముఖ్‌ను పంపింది. అనిల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో అతన్ని కోర్టులో హాజరు పర్చగా.. కోర్టు జ్యూడిషియల్ కస్టడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా.. అవినీతి, అధికారిక పదవి దుర్వినియోగం ఆరోపణలపై ఈ ఏడాది ఏప్రిల్ 21న ఎన్‌సీపీ నేత, హోంమంత్రి, అతని అనుచరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అనంతరం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అనిల్ దేశ్‌ముఖ్…రూ.100 కోట్ల లంచం తీసుకున్నారంటూ.. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల అనంతరం ఆయనపై మనీలాండరింగ్ కేసును నమోదైంది.
Also Read: