సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి.. రోజుకో క్రైం స్టోరీ చూడాల్సి వస్తోంది. కొందరు సైబర్ క్రైం చేస్తే.. మరికొందరు.. దానిని దుర్వినియోగం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అంతేకాదు.. అరచేతిలో ఉండే ఈ ఫోన్‌లో నీలిచిత్రాలను చూస్తూ.. మానవ మృగాళ్లుగా మారుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. తెనాలిలోని చంద్రబాబునాయుడు కాలనీలో పసుపులేటి దుర్గాప్రసాద్ అనే ఓ వ్యక్తి మనిషి అన్న విషయం మరిచిపోయి.. ఓ పదేళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చూడకూడని చిత్రాలను, దృశ్యాలను ఆ బాలికకు చూపాడు. దుర్గాప్రసాద్‌కు 16 ఏళ్ల క్రితం వివాహమైనా పిల్లలు కలగలేదు. దీనికి తోడుగా వేధింపుల కారణంగా భార్య కూడా అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే స్థానికంగా వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి, విక్రయించడంతో పాటు.. స్థానికంగా కొద్ది మొత్తాల్లో అప్పులు కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఇతనికి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూడడం వ్యసనంగా మారింది. అయితే ఆ వ్యసనంతో అతడు ఓ సైకోలా మారిపోయాడు. ఇంటి సమీపంలోని బాలికలను పిలిచి ఫోన్‌లో వారికి ఆ చిత్రాలను చూపించసాగాడు. గతంలో అదే ప్రాంతంలోని ఓ బాలికతో ఈ విధంగానే ప్రవర్తించగా, స్థానికులు దేహశుద్ధి చేశారు. తాజాగా శనివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న పదేళ్ల బాలికను పిలిచి సెల్‌ఫోన్‌లో చిత్రాలు చూపించాడు. చిన్నారి భయపడి, రోదిస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పుకుంది. ఆమె వచ్చి స్థానికులతో కలిసి దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.