Minor girl raped: ఖమ్మం జిల్లాలో మరో దిశ ఘటన జరిగింది. ముస్తఫానగర్‌లో మైనర్ బాలికను అత్యాచారం చేసి, ఆపై హత్యాయత్నం చేశాడు ఓ కామాంధుడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 18 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తరువాత నిందితులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోప్యంగా చికిత్స చేయించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక సంఘటన గురించి చెప్పడంతో తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Read More: