AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర విషాదం.. మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న SDRF సిబ్బంది!

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీవ్ర ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద ఎనిమిది మంది మత్స్యకారులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బందికి కూడా ప్రమాదం ఎదురైంది.

తీవ్ర విషాదం.. మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న SDRF సిబ్బంది!
Sdrf Boats Swept Awa
Balaraju Goud
|

Updated on: Nov 04, 2026 | 9:37 PM

Share

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీవ్ర ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద ఎనిమిది మంది మత్స్యకారులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బందికి కూడా ప్రమాదం ఎదురైంది.

చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు SDRF బృందం బోట్లతో సహాయక చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఐదుగురిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో అలుగు ప్రవాహంలో SDRFకు చెందిన రెండు బోట్లు కొట్టుకుపోయినట్లు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ రెండు బోట్లలో మొత్తం 10 మంది SDRF సిబ్బంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. దీంతో వారందరి పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం అదనపు బోట్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులను కాపాడే క్రమంలోనే రెస్క్యూ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం గల్లంతైన SDRF సిబ్బంది పరిస్థితి, మిగిలిన ఐదుగురు మత్స్యకారుల రక్షణపై ఉత్కంఠ నెలకొంది. అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..

బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గల్లంతైన సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి సూచించారు.

మంత్రి తుమ్మల సమీక్ష.. రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు!

బోట్లు గల్లంతైన ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఆదేశాలతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us