AP Mining mafia : దేనికైనా రెడీ, ఉత్తరాంధ్రలో తెగబడుతోన్న మైనింగ్‌ మాఫియా

Mining mafia in Andhra Pradesh : ఉత్తరాంధ్రలో అక్రమ మైనింగ్‌ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. ఇష్టారాజ్యంగా గనుల తవ్వకం జరుగుతోంది. తవ్వుకున్నవాళ్లకు తవ్వుకున్నంత అన్నట్లు

AP Mining mafia : దేనికైనా రెడీ, ఉత్తరాంధ్రలో  తెగబడుతోన్న మైనింగ్‌ మాఫియా
Mining

Updated on: Apr 11, 2021 | 10:27 PM

Mining mafia in Andhra Pradesh : ఉత్తరాంధ్రలో అక్రమ మైనింగ్‌ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. ఇష్టారాజ్యంగా గనుల తవ్వకం జరుగుతోంది. తవ్వుకున్నవాళ్లకు తవ్వుకున్నంత అన్నట్లు మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ మైనింగ్‌తో వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కాంట్రాక్టర్లు లెక్కకు అందనంత అక్రమంగా సంపాదించుకుంటున్నారు. గడిచిన ఏడాదిలో 2020 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు మైనింగ్‌ విజిలెన్స్‌ శాఖ 254 కోట్ల రూపాయల జరిమానాలు విధించిందంటే.. మైనింగ్‌ మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు.

అత్యంత విలువైన మాంగనీస్, లేటరైట్, బాక్సైట్‌తో పాటు ఐరన్ ఓర్, క్వార్ట్జ్ లాంటి ఖనిజల్ని అక్రమంగా తవ్వుతున్నారు. డిమాండ్‌ ఉన్న చోట అమ్ముకుంటున్నారు. అక్రమ మైనింగ్‌ వెనుక కొందరు అధికార పార్టీ నేతలతో పాటు రాజకీయాలకు అతీతంగా కొందరు పెద్దలు తమ బినామీలతో తెరవెనుక ఉండి తతంగాన్ని నడిపిస్తున్నారు. తేరగా దోచుకోవచ్చని పశ్చిమబెంగాల్‌ నుంచి కూడా బడా మాఫియా మాంగనీస్‌కోసం ఉత్తరాంధ్రలో వాలిపోయింది.

సర్కారుకు చేరాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లో పడుతోంది. దీంతో అక్రమ మైనింగ్‌ని కట్టడి చేసేందుకు, బినామీల భరతం పట్టేందుకు కొరఢా ఝుళిపిస్తున్నారు మైనింగ్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి. అనేక ఒత్తిళ్లు వస్తున్నా.. విధినిర్వహణలో ముందుకు సాగుతున్నారు ప్రతాప్‌రెడ్డి. మైనింగ్‌ మాఫియానుంచి ప్రమాదం ఉండటంతో.. ఆయనకు ఇద్దరు గన్‌మెన్లను కేటాయించింది ప్రభుత్వం.ఈ మైనింగ్‌ మాఫియా వెనుక.. ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందనే అనుమానాలున్నాయి. ఎకరాలకు ఎకరాలు తవ్వేస్తూ సర్కారుకు రాయల్టీలను మాత్రం కట్టడం లేదు.దీంతో సహజవనరుల గని అయిన ఉత్తరాంధ్రలో ప్రకృతి సంపద అక్రమార్కుల పాలవుతోంది.

Read also : కారులో కరెన్సీ కట్టలను కాల్చుకున్న చరిత్ర మాది కాదు : టీవీ9 కిచ్చిన ఇంటర్వూలో మంత్రి జగదీష్ రెడ్డి