Crime News: దారుణాతి దారుణం.. ఇంటికి ఆలస్యంగా వచ్చిందని 10 ఏళ్ల కూతురుని కొట్టి చంపాడు..

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటికి ఆలస్యంగా వచ్చిందని కారణంతో.. 10 చిన్నారిని కొట్టి చంపేశాడు కసాయి తండ్రి.

Crime News: దారుణాతి దారుణం.. ఇంటికి ఆలస్యంగా వచ్చిందని 10 ఏళ్ల కూతురుని కొట్టి చంపాడు..
Killed

Updated on: Oct 12, 2021 | 10:13 AM

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటికి ఆలస్యంగా వచ్చిందని కారణంతో.. 10 చిన్నారిని కొట్టి చంపేశాడు కసాయి తండ్రి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పండల్‌ను సందర్శించడానికి బాలిక తన స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ నిర్వహించే కార్యక్రమాలను వీక్షిస్తూ కూర్చుండిపోయింది. అలా రాత్రి 11 అయ్యింది. ఆ సమయంలో ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. బాలిక కూడా తన ఇంటికి వెళ్లింది.

అయితే, ఇంటికి ఆలస్యంగా రావడంపై కోపోద్రిక్తుడు అయిన బాలిక తండ్రి రాకేష్ జాదవ్.. ఆమెను కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. బాలిక కొట్టొద్దని అతని భార్య ఎంత వారించినా వినకుండా ఆవేశంలో చావబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, జాదవ్‌కు మద్యం సేవించే అలవాటు ఉందని, నిత్యం మందు తాగి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో భార్య, బిడ్డను నిత్యం కొట్టేవాడని తెలిపారు. ఈ క్రమంలో బాలికపై దాడి చేయగా.. ఆమె మృతి చెందిందని తెలిపారు.

Also read:

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచవద్దు.. మీ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.!

Bathukamma: సద్దుల బతుకమ్మ అసలైన ప్రసాదం సత్తు ముద్దలు.. ఎందుకు.. ఎలా చేస్తారో తెలుసుకోండి..7th Pay Commission: పండగ సీజన్‌లో రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.15,000 పెరగనున్న జీతం.. పదోన్నతులు..!