Mirchi Bajji: వ్యక్తి ప్రాణాలు తీసిన మిర్చి బజ్జీ.. తింటుండగా గొంతులో ఇరుక్కుని..

Crime News: వేడి వేడిగా ఉన్న బజ్జీ.. ఓ వ్యక్తి ప్రాణాన్నే బలితీసుకుంది. బజ్జీ తింటుండగా.. ఓ వ్యక్తిని మృత్యువు బలితీసుకుంది. గొంతులో బజ్జీ ఇరుక్కుని

Mirchi Bajji: వ్యక్తి ప్రాణాలు తీసిన మిర్చి బజ్జీ.. తింటుండగా గొంతులో ఇరుక్కుని..
Mirchi Bajji (Representative Image)

Edited By: Janardhan Veluru

Updated on: Sep 16, 2021 | 10:22 AM

Crime News: వేడి వేడిగా ఉన్న బజ్జీ.. ఓ వ్యక్తి ప్రాణాన్నే బలితీసుకుంది. బజ్జీ తింటుండగా.. ఓ వ్యక్తిని మృత్యువు బలితీసుకుంది. గొంతులో బజ్జీ ఇరుక్కుని ఊపిరి ఆడకపోవడంతో 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని పనుల నిమిత్తం మల్లేశ్.. సొంత గ్రామమైన వేములకు మంగళవారం రాత్రి వచ్చాడు. రాత్రి వేళ ఇంటి డాబాపై కూర్చోని హోటల్ నుంచి తెచ్చుకున్న మిర్చి తింటున్నాడు. ఈ క్రమంలో మిర్చి బజ్జీ గొంతుకు అడ్డుపడడంతో మృతి చెందాడు.

అయితే.. రాత్రి కావడంతో మల్లేశ్ ఇంటిపైనే నిద్రపోయాడని కుటుంబసభ్యులు అనుకున్నారు. బుధవారం ఉదయం డాబాపైనుంచి మల్లేశ్ రాకపోవడంతో.. కుటుంబసభ్యులు డాబాపైకి వెళ్లి చూశారు. అప్పటికే మల్లేశ్ మృతి చెందిఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బజ్జీ గొంతుకు అడ్డుపడటంతోనే మల్లేశ్ మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మల్లేశ్(40) మంగళవారం రాత్రి తన సొంత గ్రామానికి వచ్చాడు.

Also Read:

Nirbhaya Act: ‘నిర్భయ’ చట్టానికి పదేళ్లు.. అయినా మహిళను వదలని భయం.. మగువకు రక్షణ ఇంకెప్పుడు..?

Saidabad case: ఒక్కడు.. 3 వేల మంది పోలీసులు.. వేలాది కెమెరాలు.. 6 రోజులు. ఎక్కడికి వెళ్లాడు.. ఎందుకు దొరకలేదు?