Latest Crime News: రోడ్డు ప్రమాదం ఆ యువతి జీవితంలో విషాదం నింపింది.. బిడ్డను ప్రసవించిన ఐదు రోజులకే..

Latest Crime News: రోడ్డు ప్రమాదం వల్ల ఆ యువతి భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండా

Latest Crime News: రోడ్డు ప్రమాదం ఆ యువతి జీవితంలో విషాదం నింపింది.. బిడ్డను ప్రసవించిన ఐదు రోజులకే..

Updated on: Jan 10, 2021 | 9:58 AM

Latest Crime News: రోడ్డు ప్రమాదం వల్ల ఆ యువతి భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండా చేసింది. బిడ్డను ప్రసవించిన ఐదు రోజులలోనే భర్త మృతిచెందడంతో ఆ విషయం ఆమెకు ఎలా చెప్పాలో తెలియక అత్త, మామలు పడుతున్న పరిస్థితిని చూసి పలువురు కంటతడి పెడుతున్నారు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మండలంలోని వడ్డిపల్లెకు చెందిన పీట్ల క్రిష్ణయ్య కుమారుడు పి.గంగాధర కూలిపనులతోపాటు ఆటోడ్రైవర్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామానికి చెందిన తన బంధువుల అమ్మాయి మంగమ్మను ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం స్థానిక ఇందిరమ్మ కాలనీకి తన నివాసం మార్చాడు. ఫైనాన్స్‌ కింద టాటా సుమో తీసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల క్రితం మంగమ్మ ప్రసవించడంతో వారి ఇంట కొత్త వెలుగు వచ్చినట్లైంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన ద్విచక్రవాహనంలో కలకడ నుంచి ఇందిరమ్మ కాలనీకి వస్తూ గంగాధర మృత్యువాత పడ్డాడు. మార్గమధ్యంలో అదుపుతప్పి చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై పడిపోయాడు. గాయపడిన అతడిని స్థానికులు 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ గంగాధర మృతి చెందాడు. మృతుని పిన తండ్రి రఘునాథ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. బోర్ కొట్టి విడిపోతున్నారు.. హాట్ టాపిక్‌గా మారిన ఐఏఎస్ జంట..

Loading...
Unable to load recommendations.
Follow Us