Man Commits Suicide: జగిత్యాల జిల్లాలో ఘోర సంఘటన.. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఉరేసుకొని ఆత్మహత్య..

Man Commits Suicide: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర సంఘటన జరిగింది. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య

Man Commits Suicide: జగిత్యాల జిల్లాలో ఘోర సంఘటన.. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఉరేసుకొని ఆత్మహత్య..

Updated on: Jan 11, 2021 | 10:52 AM

Man Commits Suicide: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర సంఘటన జరిగింది. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలంలోని నూకపల్లిలో జగిత్యాల-కరీనంగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న 130 కేవీ కరెంట్‌ టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ కావడంతో మృతదేహం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలేమి తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి గురించి ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు అందించాలని కోరారు.

Sachin Tendulkar Coments: జాత్యహంకార వ్యాఖ్యలపై స్పందించిన సచిన్.. ఆస్ట్రేలియా క్రికెటర్లను ఉద్ధేశించి..