హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హై టెన్షన్ కరెంట్ స్థంభంపైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ఓ యువతి మిస్సింగ్ కేసులో విచారణ భీమ్ శంకర్‌ని పోలీసులు ఏపీ నుంచి విచారణ కోసం బాచుపల్లి తీసుకొచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ రాగానే శంకర్ పక్కనే ఉన్న విద్యుత్ టవర్ ఎక్కాడు. టవర్ నుంచి దూకుతానంటూ కాసేపు పోలీసులను టెన్షన్ పెట్టాడు. ఎట్టకేలకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శంకర్‌ను టవర్ పై నుంచి కిందకు దింపారు. ఓ మిస్సింగ్ కేసులో భాగంగానే అతడ్ని హైదరాబాద్ తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు.