2-BHK fraud: షార్ట్‌కట్‌లో ఫ్లాట్‌ కొట్టేద్దామనుకున్నారు… సైలెంట్‌గా కోటి రూపాయలకుపైగా కాజేసిన 420 గాళ్లు

|

Mar 22, 2021 | 10:06 PM

పెద్ద మనిషిలా బిల్డప్ ఇస్తున్న ఇతనో పక్కా ఫోర్‌ట్వంటీ. ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని ఆశ పెట్టి మోసం చేశాడు. ఒకరిద్దర్ని కాదు...హోల్‌సేల్‌గా ఓ పది మందిని నిండా ముంచాడు.

2-BHK fraud: షార్ట్‌కట్‌లో ఫ్లాట్‌ కొట్టేద్దామనుకున్నారు... సైలెంట్‌గా కోటి రూపాయలకుపైగా కాజేసిన 420 గాళ్లు
Vanasthalipuram
Follow us on

2 BHK Housing : పెద్ద మనిషిలా బిల్డప్ ఇస్తున్న ఇతనో పక్కా ఫోర్‌ట్వంటీ. ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని ఆశ పెట్టి మోసం చేశాడు. ఒకరిద్దర్ని కాదు…హోల్‌సేల్‌గా ఓ పది మందిని నిండా ముంచాడు. ఎక్కువగా రిస్క్ చేయకుండా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్లనే తన వలలో వేసుకొని…నోట్ల కట్టలు తీసుకున్నాడు. చూశారుగా రిచ్‌గా కనిపిస్తున్న ఈ అపార్ట్‌మెంట్లను చూపించి …ఇందులోనే మీకు ఫ్లాట్లు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 2నుంచి 3 లక్షలు వసూలు చేశాడు. ఇలా పది మంది దగ్గర కోటి రూపాయలకుపైగా కాజేశాడు. ఇదంతా జరిగింది ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోనే.

పేరు సుబ్రమణ్య శర్మ. కలెక్టర్ ఆఫీస్‌లో పీఏని అంటూ బాధితుల్ని పరిచయం చేసుకున్నాడు. ఈయన గురించి బిల్డప్ ఇవ్వడానికి బావమరిదిని పక్కన పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసే వ్యవహారం అంతా నడిపించారు. అసలు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడమే ఓ మోసం అయితే… మాకు కింద ఫ్లోర్‌లో ప్లాట్లు వచ్చేలా చూడండి అంటూ బాధితులు వీళ్లను బ్రతిమిలాడుకోవడం ఈమోసంలో కొసమెరుపు.

అంతే కాదు…ఇచ్చే డబ్బుల్ని కూడా దేవుడి దగ్గర పెట్టి ఇవ్వు అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. మోసగాళ్లు కదా… మళ్లీ డబ్బులు తిరిగి రావని చెప్పలేక … చివరి సారిగా మీ డబ్బుల్ని చూసుకోమని ఇండైరెక్ట్‌గా హింట్ కూడా ఇచ్చారు. పాపం బాధితులకు తెలియదు కదా… వాళ్లు పక్కా చీటర్స్ అని.

డబ్బులు తీసుకున్న సుబ్రమణ్య శర్మ ఆయన బావమరిది పత్తా లేకపోవడంతో బాధితులు వనస్ధలిపురం పోలీసుల్ని ఆశ్రయించారు. జరిగినదంతా పోలీసులకు పూస గుచ్చినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో డబ్బులు తీసుకున్న సుబ్రమణ్యశర్మ…అతని బావమరిదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరీ ఆ కేటుగాళ్లను ఎప్పటిలోగా పట్టుకుంటారో …వాళ్ల వెనుక ఇంకా ఎవరైనా బడా బాబులు ఉన్నారో పోలీసులే తేల్చాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: TS PRC Calculator 2021: పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!

Alert ! LIC: ఎల్ఐసీ ఖాతాదారులకు ముఖ్య సూచన..ఈ ఫారం నింపకపోతే మీ డబ్బులు ఇరుక్కుపోతాయి..