Telangana Crime News: వృద్ధురాలిపై అత్యాచారం.. కల్లు తాగించి అఘాయిత్యం.. సంచలన తీర్పునిచ్చిన న్యాయస్థానం

|

Feb 11, 2022 | 6:40 AM

సమాజంలో రోజూ ఎక్కడో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ కారణాలతో పలువురు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. వయసు, లింగ బేధం చూడకండా కర్కశంగా వ్యవహరిస్తున్నారు....

Telangana Crime News: వృద్ధురాలిపై అత్యాచారం.. కల్లు తాగించి అఘాయిత్యం.. సంచలన తీర్పునిచ్చిన న్యాయస్థానం
Old Rape
Follow us on

సమాజంలో రోజూ ఎక్కడో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ కారణాలతో పలువురు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. వయసు, లింగ బేధం చూడకండా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తాజా 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులకు మల్కాజ్‌గిరి(Malkajigiri) కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2019 డిసెంబరు 17న కల్లు దుకాణం వద్ద ఓ వృద్ధురాలితో ఇద్దరు మాటలు కలిపారు. పెయింటర్లుగా పనిచేస్తున్న ఆంథోని, విజయ్‌ లు వృద్ధురాలిని తమ గదికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కల్లు తాగారు. వృద్ధురాలు మత్తులోకి జారగానే ఆంథోని, విజయ్‌ కలిసి ఆమైపై అత్యాచారాని(Rape)కి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయ్, ఆంథోనీలను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరి కోర్టులో విచారణ సందర్భంగా పోలీసులు ఆధారాలు సమర్పించడంతో పాటు సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చిన మల్కాజ్‌గిరి కోర్టు.. జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించిన మల్కాజ్‌గిరి పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు.

Also Read

Rana Ayyub: మనీలాండరింగ్ కేసు.. జర్నలిస్ట్ రాణా ఆయుబ్‌కు బిగిస్తున్న ఉచ్చు..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. మృగ్గురు దర్మరణం

ప్రేమించి మోసం చేశాడు !! గూఢచారిపై కోర్టుకెక్కిన మహిళకు ₹2 కోట్ల పరిహారం.. వీడియో