Villagers punished lovers: మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న అటవిక పాలన మరోసారి బయటపడింది. తప్పు చేసిన వారిని పోలీసులకు అప్పగించాల్సింది పోయి.. తామే కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ధార్ పరిధిలోగల ఒక గ్రామంలో ప్రేమ జంటకు తాలిబన్ల తరహా శిక్షను అమలు చేసిన ఉదంతం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయటపడింది. ధార్ అడిషినల్ ఎస్పీ దేవేంద్ర పాటీదార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన కుండీ గ్రామంలో సెప్టెంబరు 12 న చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఉదంతం సభ్య సమాజానికి తెలిసింది. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు.
కుండీ ప్రాంతానికి చెందిన ఒక యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు వారి కుటుంబసభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని, తన ప్రియుడు గోవింద్‌తో కలసి గుజరాత్‌కు పారిపోయింది. దీంతో ఆ యువతి కుటుంబీకులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇంతలోనే ఆమె తన ప్రియుడితో పాటు ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో ఆమె కుటుంబసభ్యలు.. ఆ ప్రేమికులిద్దరితో పాటు వారికి సహకరించిన మరో బాలికను కూడా చితకబాదారు. ఆ తరువాత వారి మెడలలో టైర్లు వేసి ఊరంతా తప్పారు. ఈ సందర్భంగా వీడియో కూడా తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also… West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో విషాదం.. ఓ కంపెనీ నిర్వాకంతో యువకుడు ఆత్మహత్య..