ప్రేమికుల ఆత్మహత్య.. ప్రియుడు మృతి.. ఆస్పత్రిలో ప్రియురాలు

|

Jul 30, 2020 | 3:27 AM

వావి వరుసలు మరిచారు. ఒక్కటవ్వలానుకున్నారు. బాబాయ్-అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పే ధైర్యంలేదు. కలిసి కాపురం చేయలేమని.. సమాజాన్ని ఎదురించి బ్రతకలేమని భావించిన ఆ జంట బలవన్మరణానికి యత్నించింది. యువకుడు మృతి చెందగా, యువతి కొనఉపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రేమికుల ఆత్మహత్య.. ప్రియుడు మృతి.. ఆస్పత్రిలో ప్రియురాలు
Follow us on

వావి వరుసలు మరిచారు. ఒక్కటవ్వలానుకున్నారు. బాబాయ్-అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పే ధైర్యంలేదు. కలిసి కాపురం చేయలేమని.. సమాజాన్ని ఎదురించి బ్రతకలేమని భావించిన ఆ జంట బలవన్మరణానికి యత్నించింది. యువకుడు మృతి చెందగా, యువతి కొనఉపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం సారాపూర్‌ తండాకు చెందిన నేనావత్‌ రమేశ్‌ (24), అదే తండాకు చెందిన 18 ఏళ్ల యువతి మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం తెలియని యువతి కుటుంబసభ్యులు ఆమెకు పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో.. ఈ ప్రేమికులు తాము కలిసి ఉండేందుకు.. బంధం కాని బంధంతో కలిసి ఉండలేము. పెద్దలను పెళ్లికి ఒప్పించలేమని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువతి అపస్మారక స్థితికి చేరుకోగా, రమేష్‌ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. బుధవారం చావు బతుకుల మధ్య ఉన్న యువతిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా.. పురుగుల మందు తాగిన యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి కుటుంబ సభ్యులే రమే్‌షను హత్య చేశారని ఆరోపిస్తూ మృతుడి బంధువులు యువతి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.