కడప జిల్లా జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం.. లారీ ఇంజన్‌లో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్దమైన ట్రక్కు

కడప జిల్లాలో ఓ లారీ నిప్పంటుకుని కాలిబూడిదైంది. రామాపురం మండలం గువ్వల చెరువు చెక్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కడప జిల్లా జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం.. లారీ ఇంజన్‌లో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్దమైన ట్రక్కు

Updated on: Feb 23, 2021 | 10:50 AM

Lorry fire accident : కడప జిల్లాలో ఓ లారీ నిప్పంటుకుని కాలిబూడిదైంది. రామాపురం మండలం గువ్వల చెరువు చెక్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులందరూ నివ్వెరపోయి చూస్తుండగానే ఘటన జరిగిపోయింది. చెన్నై జాతీయ రహదారిపై ఒక ట్రక్కులో భారీ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తం అయిన డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రక్కు పూర్తిగా మంటల్లో కాలి బూడిద అయ్యింది. కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ నుంచి పాండిచ్చేరికి టైల్స్ లోడుతో వెళ్తున్న ట్రక్కు అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఇంజిన్‌లో సడన్ గా పొగలు వ్యాపించడంతో గమనించిన డ్రైవర్‌ వెంటనే వాహనాన్ని పక్కకు నిలిపి వేశారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచారు. సమాచారం అందిన వెంటనే.. ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సర్వీస్‌ యూనిట్‌ క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పి వేసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే లారీ పూర్తి కాలిపోయింది. కాగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న రామాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండిః  బయటపడుతున్న కనకదుర్గమ్మ గుడి అక్రమాలు.. చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్.. 13 మందిపై వేటు