Crime News: అప్పుడు భార్యను దారుణంగా చంపాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. అసలేమైందంటే..?

Life Term Jail: అతను మంచి ఉన్నత విద్యను అభ్యసించిన యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే.. ఆమె అందరితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించి..

Crime News: అప్పుడు భార్యను దారుణంగా చంపాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. అసలేమైందంటే..?
Jail

Updated on: Oct 28, 2021 | 7:06 AM

Life Term Jail: అతను మంచి ఉన్నత విద్యను అభ్యసించిన యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే.. ఆమె అందరితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించి.. చివరికి కడతేర్చాడు. చేతులు, కాళ్లు కట్టేసి నిప్పంటించి దారుణంగా చంపాడు. ఈ ఘటన ఒడిశాలో 2016లో జరగగా.. తాజాగా బుధవారం కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. ఒడిశాలోని మయూభంజ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడు తన భార్యను హత్య చేసినందుకు బుధవారం కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. రాయంగ్‌పూర్ అదనపు జిల్లా జడ్జి అనుప్ పట్నాయక్.. నిందితుడు రాథా నాయక్‌కు ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద శిక్ష విధించారు. దీంతోపాటు రూ.10,000 జరిమానా కూడా విధించారు. ఒకవేళ నిందితుడు జరిమానాను చెల్లించకపోతే.. మరో ఆరు నెలల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుంది.

ఆగస్ట్ 2016న బిసోయ్ బ్లాక్‌లోని బధునియా గ్రామంలో నాయక్ తన భార్య రాణి సింగ్ (20)ను ఇంట్లో హత్యచేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సు అయిన రాణి సింగ్‌పై అనుమానం పెంచుకున్న నాయక్ దారుణంగా చంపినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంకజ్ దాస్ వెల్లడించారు. పలువురితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించి ఈ దారుణానికి ఒడికట్టినట్లు పేర్కొన్నారు.

Also Read:

PM Modi: భారత్-ఆసియాన్ 18వ సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. ఆసియా దేశాలతో సామరస్యమే ఎజెండా!

Mullaperiyar Dam: ఇరు రాష్ట్రాల ప్రజల నీటి అవసరాలను భవిష్యత్‌ను కాపాడుకుందామని కేరళ సీఎంకు.. స్టాలిన్ లేఖ