Kamareddy Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాచారెడ్డి మండలం లక్ష్మీదేవునిపల్లిలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవదంపతులు ప్రవీణ్, రేణుకలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు దోమకొండ మండలం ముత్యంపేట వాసులుగా గుర్తించారు. నవదంపతుల మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా, రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నపడం, మద్యం సేవించి నడపం, అతి వేగం తదితర కారణాల వల్ల ప్రతి రోజు దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లామంటే ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Also Read: Crime News: ఆస్తి తగాదాలు.. మాజీ మంత్రి కోడలు, మనవరాలిని దారుణంగా చంపిన దుండగులు..