ఒకే అమ్మాయిని ప్రేమించిన అన్నదమ్ముళ్లు.. చివరికి ఇద్దరూ పట్టాలపై విగత జీవులయ్యారు.. ఇంతకీ ఎం జరిగిందంటే..?

|

Mar 09, 2021 | 9:06 AM

ప్రేమ పేరుతో యువతీ యువకులు క్షణికావేశంలో నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రాణం కన్న మిన్నగా పెంచుకున్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు.

ఒకే అమ్మాయిని ప్రేమించిన అన్నదమ్ముళ్లు.. చివరికి ఇద్దరూ పట్టాలపై విగత జీవులయ్యారు.. ఇంతకీ ఎం జరిగిందంటే..?
Follow us on

Two cousins end lives : ప్రేమ పేరుతో యువతీ యువకులు క్షణికావేశంలో నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రాణం కన్న మిన్నగా పెంచుకున్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు అవతారనుకుంటే ప్రేమ పేరుతో మాయా ప్రపంచానికి బలవుతున్నారు. ఇలా చేసుకోవద్దని యువతకు ఎంత అవగాహన కలిగించే ప్రయత్నం చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతూనే ఉన్నాయి. తాజాగా.. రాజస్తాన్‌లో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఒక యువతిని వరుసకు అన్నదమ్ములయ్యే ఇద్దరు యువకులు ప్రేమించారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆ ఇద్దరూ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుంది జిల్లాలోని కేశవ్‌పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్‌రాజ్ గుర్జర్(23) వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు. ఆ యువతినినే ఇద్దరు ప్రాణం కన్న ఎక్కువగా గాఢంగా భావించారు. ఆ ఇద్దరిలో ఎవరి ప్రేమను ఆ యువతి అంగీకరించిందో లేక ఇద్దరూ వన్‌సైడ్ లవ్ చేశారో తెలియదు గానీ ఇద్దరూ ఆమె పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఏమైందో ఏమో గానీ గుడ్ల గ్రామం సమీపంలోని రైలు పట్టాలపై ఆదివారం రాత్రి ఇద్దరూ విగత జీవులై పడి ఉన్నారు. ఇదీ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అయితే, ఇద్దరికి సంబంధించి మొబైల్ ఫోన్‌లో ఒకే అమ్మాయికి సంబంధించి చిత్రాలు ఉండటంతో పోలీసులు ఈ దిశగా విచారణ చేపట్టారు.

ఫోన్ సంభాషణలు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి సదరు యువతి కనిపించకుండా పోయింది. మహేంద్ర, దేవ్‌రాజ్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని సీఆర్‌పీఎఫ్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read Also…  అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు