నీలోఫర్ డాక్టర్ల నిర్వాకం.. పిల్లలపై మందులతో ప్రయోగం..

| Edited By:

Sep 27, 2019 | 9:24 AM

నీలోఫర్ ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయి. చిన్నారులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లే వారి పై ప్రయోగాలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వైద్యం కోసం వచ్చిన చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ పిల్లలపై ప్రయోగాలు చేస్తున్నారు. డ్రగ్స్ కూడా ట్రయల్స్ చేస్తున్నట్లు […]

నీలోఫర్ డాక్టర్ల నిర్వాకం.. పిల్లలపై మందులతో ప్రయోగం..
Follow us on

నీలోఫర్ ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయి. చిన్నారులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లే వారి పై ప్రయోగాలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. వైద్యం కోసం వచ్చిన చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నారు. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ పిల్లలపై ప్రయోగాలు చేస్తున్నారు. డ్రగ్స్ కూడా ట్రయల్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇద్దరు డాక్టర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిలోఫర్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివరాలు అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇన్ని రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇప్పటివరకు దాదాపు 50 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు సమాచారం.