ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు.. గుట్టలకు గుట్టల మనీ.. కమల్‌ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంట్లో దొరికిన డబ్బు..

| Edited By: Ram Naramaneni

Mar 20, 2021 | 8:04 AM

I-T raids: ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు..గుట్టలకు గుట్టల మనీ. ఎస్‌..తమిళనాట ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. మూడ్రోజులుగా జరుగుతున్న సోదాల్లో పెద్ద ఎత్తున మనీని సీజ్‌ చేశారు అధికారులు.

ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు.. గుట్టలకు గుట్టల మనీ.. కమల్‌ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంట్లో దొరికిన డబ్బు..
I T Raids At Kamal Haasan's
Follow us on

I-T Raids at Kamal Haasan’s MNM Treasurer: ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు..గుట్టలకు గుట్టల మనీ. ఎస్‌..తమిళనాట ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. మూడ్రోజులుగా జరుగుతున్న సోదాల్లో పెద్ద ఎత్తున మనీని సీజ్‌ చేశారు అధికారులు.

కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం ట్రెజరర్‌ ..చంద్రశేఖరన్‌ నివాసం, కార్యాలయాలపై మూడ్రోజులుగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బు దాచి పెట్టారనే సమాచారంతోనే ఈ తనిఖీలు నిర్వహించింది ఐటీ శాఖ. ఈ దాడుల్లో భారీగా నగదు బయటపడింది. ఇప్పటివరకు 11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో చంద్రశేఖరన్‌కు చెందిన అనిత టెక్సో సంస్థ కీలకంగా ఉంది. మరోవైపు మంత్రి సంపత్‌ బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రలోభాల్లో టాప్‌ పొజిషన్‌లో ఉంది తమిళనాడు. అదికూడా అఫీషియల్‌గా పట్టుకున్న డబ్బుల లెక్కలోనే. ఇక ఎవరికీ దొరక్కుండా, ఎవరి కంటాపడకుండా ఇంకెంత సొమ్ము జనానికి పంచేశారో అన్నది అంచనాకు కూడా అందడం లేదు. క్యాష్‌తో పాటు అడక్కుండానే ఇళ్లకు నజరానాలు చేరిపోతున్నాయి. పట్టు చీరలు , వెండి సామాన్లు, వంటింటి సామాన్లు ఇలా అన్ని రకాలుగా ఓటర్లకు గాలమేస్తున్నారు.

డబ్బుతో కొడితేగానీ పనికాదని గట్టిగా ఫిక్స్‌ అయిపోయారు తమిళనాడు లీడర్లంతా. అందుకే అరవనాట ఎప్పుడూ లేనంత కరెన్సీ ప్రభావం కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే అత్యధికంగా తమిళనాడులో ఎన్నికల అధికారుల తనిఖీల్లో ఇప్పటిదాకా 127 కోట్లదాకా డబ్బు దొరికింది. శ్రీవిల్లిపుత్తూర్‌లో 3కోట్ల 25లక్షల నగదును పట్టుకున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు .

తమిళనాడులో ఈసీ దాడుల్లోనే భారీగా డబ్బు దొరుకుతుండటంతో ఆదాయపు పన్నుశాఖ అలర్ట్‌ అయింది. ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఐటీ దాడుల్లో 4వందల కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఇదంతా లెక్కచూపని నగదే. చెన్నై, కాంచీపురం, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్‌ సహా పలు జిల్లాల్లో.. కదిలిస్తే చాలు కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి

 

ఇవి కూడా చదవండి: ఇది కూడా ఔటేనా..! కాదే..! అంపైర్ నిర్ణయం సెటైర్లు..! కళ్లకు గంతలు కట్టుకున్నారా అంటూ సెహ్వాగ్ ట్వీట్..