Hyderabad Crime: హైదరాబాద్‌లోని కేపీహెచ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంగా ఉన్న కూతురుని ఉద్యోగానికి వెళ్లవద్దని తండ్రి మందలించటంతో.. కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ 1 లో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మమత అనే వివాహిత నిజాంపేటలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. 2019లో ఆమెకు వివాహం అవగా.. భర్తకు క్యాన్సర్ ఉందని తెలియటంతో పెళ్లైన రెండు నెలలకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తోంది. నిజాంపేటలోని ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తోంది.
అయితే, మంగళవారం నాడు మమత ఆరోగ్యం సరిగా లేదు. దాంతో ఉద్యోగానికి వెళ్లనవసరం లేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని మమతను ఆమె తండ్రి ఎల్లయ్య మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకెళ్లిన ఎల్లయ్య.. తిరిగి ఇంటికొచ్చి చూడగా మమత విగత జీవిగా ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందకు దింపగా అప్పటికే ప్రాణాలు విడిచింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మమత మృతికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..!
Andhra Pradesh: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం.. నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి..
Huzurabad Bypoll: దళిత బంధు నిలిపివేత.. బీజేపీపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు..