Shilpa Chowdary: ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కిలాడి లేడి శిల్పా చౌదరి లీలలు.. తాజా లిస్టులో ప్రముఖ సినీ ఫ్యామిలీ!

|

Dec 02, 2021 | 8:43 AM

శిల్పాచౌదరి.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగుతోంది. ఆమె బాధితుల లిస్టు పెరగడమే అందుకు కారణం. తాజాగా బాధితుల లిస్టులో ప్రముఖ ఫ్యామిలీ మెంబర్ చేరారు.

Shilpa Chowdary: ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కిలాడి లేడి శిల్పా చౌదరి లీలలు.. తాజా లిస్టులో ప్రముఖ సినీ ఫ్యామిలీ!
Shilpa Chowdary
Follow us on

Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరి.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగుతోంది. ఆమె బాధితుల లిస్టు పెరగడమే అందుకు కారణం. తాజాగా బాధితుల లిస్టులో ప్రముఖ ఫ్యామిలీ మెంబర్ చేరారు. శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి అని సైబరాబాద్ పోలీసులు తేల్చేశారు. మాయ‌మాట‌లు చెప్పి ధనవంతులను, సెలబ్రెటీలను ఈజీగా మోసం చేసినట్లు గుర్తించారు. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్లతో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి, ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా మకాం మార్చేసింది. ఈ కేసులో సినీ ప‌రిశ్రమ‌కు చెందిన శిల్పాచౌద‌రిని శ‌నివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగ్‌ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లా లో నివాసముంటున్న చౌదరి అనే మహిళ గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం చేసుకుని తాను సినీ ఫీల్డ్ లో ప్రొడ్యూసర్ నంటూ నమ్మబలికి వారి నుంచి విరివిగా ఒక్కొక్కరి వద్ద కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతోంది.

ఇలా శిల్పాచౌదరి మోసం చేసినవారి జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు బాధితులు. తాజాగా హీరో సుధీర్‌బాబు భార్య, మహేష్‌బాబు సోదరి ప్రియను కూడా శిల్పాచౌదరి మోసం చేసినట్టు వెల్లడైంది. 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వకపోవడంతో నార్సింగ్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ప్రియ. మరోవైపు శిల్పాచౌదరి కేసు పోలీసులను ముప్ప తిప్పలు పెడుతోంది. ఆమె బాధితుల్లో ఎక్కువ మంది ప్రముఖులే ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. తమకు రావల్సిన 40 కోట్ల రూపాయల ఇప్పించాలని సైబరాబాద్ పోలీసుల వెంటపడ్తున్నారు ప్రముఖులు.

ఇదిలావుంటే, శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పాచౌదరికి ఉన్న 6 బ్యాంక్ అకౌంట్స్‌పై ఆరా తీస్తున్నారు దర్యాప్తు అధికారులు. వివరాలు ఇవ్వాలంటూ బ్యాంకర్లకు లేఖ రాశారు నార్సింగి పోలీసులు. అయితే కొంత మంది బాధిత బడా మహిళలు మాత్రం ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. బ్లాక్ మనీ, ఐటీకి బయపడి ఫిర్యాదు చేయలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా డబ్బులు ఇచ్చి తలలు పట్టుకుంటున్నారు పేజ్ త్రీ మహిళలు. శిల్పా ఎపిసోడ్‌లో అనేక కోణాలున్నాయి. కొందరు పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరికొందరు మాత్రం కంప్లైంట్ చేయడానికి ముందుకు రావడం లేదు. తాజాగా హీరో సుధీర్‌బాబు భార్య ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఈ కేసులో ఇంకా మరికొందరు కూడా బయటకి వచ్చే ఛాన్స్‌ లేకపోలేదు. మరోవైపు తమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజేంద్రనగర్ కోర్టు మెట్లెక్కారు శిల్పాచౌదరి, భర్త శ్రీనివాస్‌. కాదుకాదు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు పోలీసులు. ఈ రెండింటిపై విచారణ చేపట్టిన కోర్టు, విచారణను వాయిదా వేసింది.

Read Also…  Burning Topic: ఆవేశంలో నోరు జారాను క్షమించండి.. తెలుగు రాజకీయాలో కొత్త అధ్యయనం వల్లభనేని వంశీ వ్యాఖ్యలు..(వీడియో)