
హైదరాబాద్ మహానగ శివారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో సంచలనాలు బయటపడ్డాయి. గంజాయికి అలవాటు పడ్డ ఓ కొడుకు స్నేహితులతో కలిసి కన్న తండ్రినే కడతేర్చేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
జనవరి 26న మహమ్మద్ మెహతాబ్ ఉద్దీన్‌ను కత్తులతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. షహీన్ నగర్ బిస్మిల్లా కాలనీకి చెందిన మహమ్మద్ మెహతాబ్ ఉద్దీన్ అనే వ్యక్తిని బార్కాస్ ప్రాంతానికి చెందిన అలీ బరాక్ బా, షహీన్ నగర్‌కు చెందిన మహమ్మద్ ఖలేద్ దయాని, షేక్ మహమ్మద్, ఫరూక్ లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
ఏ1 నిందితుడు ఖదీర్ బరాక్ బా తండ్రి అలి బరాక్ బాను మెహతాబ్ ఉద్దిన్ నిత్యం గంజాయి అలవాటు చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గంజాయి విషయంలో గొడవ జరిగింది. అలీ బరాక్ బా మెహతాబ్ ను గంజాయి అడిగాడు. అందుకు తన దగ్గర లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అలి బరాక్ బాను మెహతాబ్ ఉద్దిన్ బెదిరించాడని కోపంతో రగిలిపోయిన ఖదీర్ తన నలుగురు స్నేహితులతో కలిసి మెహతాబ్ ఉద్దిన్ కత్తులు, ఇనుపరాడ్లు, సిమెంట్ ఇటుకలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మెహతాబ్ ఉద్దీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మెహతాబ్ ఉద్దిన్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న షారూక్ దగ్దు షేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..