ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌ విలువ రూ.2 వేల కోట్లు..!

|

Aug 23, 2020 | 5:12 PM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌ 2 వేల కోట్ల రూపాయలకు చేరుకుందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. రెండు అక్కౌంట్ల నుంచి చైనాకు నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌ విలువ రూ.2 వేల కోట్లు..!
Follow us on

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌ 2 వేల కోట్ల రూపాయలకు చేరుకుందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. రెండు అక్కౌంట్ల నుంచి చైనాకు నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. దాకి పే, లింక్‌ యూ కంపెనీల పేర్లతో ఈ తంతు సాగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఢిల్లీకి చెందిన ధీరజ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొదట్లో 1100 కోట్ల స్కామ్‌ జరిగినట్లు తేల్చారు. తాజా మరో రెండు అక్కౌంట్లను గుర్తించారు సీసీఎస్‌ పోలీసులు. అరెస్టయిన నలుగురు నిందితులను కస్టడీకి ఇచ్చింది కోర్టు. దర్యాప్తులో భాగంగా పేటీఎమ్‌ ప్రతినిధులను పోలీసులు ప్రశ్నించారు. మరోవైపు – ఈ దందాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా దర్యాప్తు చేస్తున్నాయి. ప్రధాన నిందితుడు ధీరజ్ దొరకితే మరింత విలువైన సమాచారం రాబట్టవచ్చని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.