Crime News: పెళ్లైన నాలుగు నెలలకే భర్త అదృశ్యం.. బావిలో మృతదేహం.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Oct 06, 2021 | 4:52 PM

తమిళనాడు పుదుకొట్టై జిల్లాలోని పెరుంగలూరు పంచాయతీ పరిధిలోని బోరం గ్రామానికి చెందిన పండితురై అనే 29 ఏళ్ల యువకుడికి, నందిని అనే 23 ఏళ్ల యువతికి పెద్దలు నాలుగు నెలల క్రితం పెళ్లి చేశారు...

Crime News: పెళ్లైన నాలుగు నెలలకే భర్త అదృశ్యం.. బావిలో మృతదేహం.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Crime News
Follow us on

తమిళనాడు పుదుకొట్టై జిల్లాలోని పెరుంగలూరు పంచాయతీ పరిధిలోని బోరం గ్రామానికి చెందిన పండితురై అనే 29 ఏళ్ల యువకుడికి, నందిని అనే 23 ఏళ్ల యువతికి పెద్దలు నాలుగు నెలల క్రితం పెళ్లి చేశారు. వివాహనంతరం అన్ని కార్యక్రమాలు జరిపోయాయి. వారి కాపురం నెల రోజులు బాగానే జరిగింది. కానీ తర్వాత మొదలైంది అసలు కథ

వారిద్దరు అయిన దానికీ, కాని దానికీ గొడవ పడుతూ ఉండేవారు. పెద్దలు చెప్పినా భార్యాభర్తల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. నాలుగు నెలల నుంచి రోజు గొడవ పడుతూనే ఉండేవారు. ఉన్నట్టుండి సెప్టెంబర్ 20 నుంచి పండితురై కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా కనిపించలేదు. అతని ఫోన్‎కు ఫోన్ చేస్తే స్వీచ్చాఫ్ వస్తుంది. ఆందోళన చెందిన పండితురై తల్లి మీనాక్షి అదనకొట్టై పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులు ఈ కేసులో పండితురై భార్య నందినిని అనుమానితురాలిగా భావించి విచారించగా అసలు పండితురై ఏమయ్యాడన్న నిజం బయటపడింది. పండితురైని తానే చంపేసి.. ఇంటి వెనకున్న పాడుబడిన బావిలోకి శవాన్ని పడేశానని నందిని చెప్పింది. సెప్టెంబర్ 20న తన భర్తతో గొడవ జరిగిందని, తన భర్త కత్తితో గొంతు కోయాలని చూశాడని చెప్పింది. దీంతో దొరికిన వస్తువుతో అతని తలపై కొట్టానని.. దెబ్బ తీవ్రంగా తగలడంతో అతను చనిపోయాడని నందిని తెలిపింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన భర్త మృతదేహాన్ని ఎవరూ చూడకుండా ఇంటికి దగ్గర్లో ఉన్న పాడుబడిన బావిలోకి తోసేశానని నందిని చెప్పింది. పోలీసులు ఆ బావిలో ఉన్న పండితురై మృతదేహాన్ని వెలికితీయించారు. చనిపోయి దాదాపు 15 రోజులు కావస్తుండటంతో శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న స్థితిలో ఉంది.

Read Also.. Cannabis: హైదరాబాద్‌లో గంజాయి కోసం స్టూడెంట్స్ వెంపర్లాట.. ఒక్క రాత్రే 100 మంది అదుపులోకి